గూగుల్‌కు షాక్.. ఓపెన్‌ఏఐలో చేరిన ‘జెమినీ’ రూపకర్త
- ఓపెన్‌ఏఐలో చేరుతున్నట్లు నోయామ్ షజీర్ ప్రకటన
- ఏఐ మోడళ్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తగా గుర్తింపు
- ‘Attention Is All You Need’ పరిశోధనా పత్రానికి సహ-రచయిత
- ఈ పరిశోధననే నేటి చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ మోడళ్లకు మూలం
- షజీర్ చేరిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గూగుల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ జెమినీ ఏఐ మోడళ్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ శాస్త్రవేత్త, సంస్థ వైస్ ప్రెసిడెంట్ నోయామ్ షజీర్ ఓపెన్‌ఏఐలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం ఏఐ రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది.
‘‘ఓపెన్‌ఏఐలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అక్కడి ప్రతిభావంతమైన బృందంతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నా’’ అని షజీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఓపెన్‌ఏఐ ప్రారంభించినప్పటి నుంచి కలిసి పనిచేయాలని కోరుకున్న వ్యక్తుల్లో నోయామ్ ఒకరు. పదేళ్ల తర్వాత అది సాధ్యమైంది’’ అని వ్యాఖ్యానించారు.
ఏఐ ప్రపంచంలో అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన షజీర్ 2000లో గూగుల్‌లో చేరారు. సంస్థలో తొలి 100 మంది ఉద్యోగుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చాట్‌బాట్లు, లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల అభివృద్ధికి పునాది వేసిన 2017లో విడుదలైన ప్రసిద్ధ ‘Attention Is All You Need’ పరిశోధనా పత్రానికి ఆయన సహ రచయితగా ఉన్నారు. ఈ పరిశోధననే నేటి చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ మోడళ్లకు మూలంగా భావిస్తారు.
గూగుల్ నుంచి 2021లో బయటకు వచ్చిన షజీర్ తన సొంతంగా ‘Character.AI’ను స్థాపించారు. అనంతరం 2024లో దాదాపు 2.7 బిలియన్ డాలర్ల ఒప్పందంతో గూగుల్ ఆయనను తిరిగి సంస్థలోకి తీసుకొచ్చింది. అయితే రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఆయన మళ్లీ గూగుల్‌కు వీడ్కోలు పలికారు.
అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో గణితం, కంప్యూటర్ సైన్స్ చదివిన షజీర్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభ కనబరిచారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహించి పూర్తి మార్కులతో స్వర్ణ పతకం సాధించారు.
ఏఐ రంగంలో ప్రతిభావంతుల కోసం సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నవేళ షజీర్ ఓపెన్‌ఏఐలో చేరడం వ్యూహాత్మకంగా కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతున్న ఓపెన్‌ఏఐకు ఇది మరింత బలం చేకూర్చే అంశంగా చెబుతున్నారు.